జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాల అర్బన్, జనవరి 24 (విజయక్రాంతి): ఉరుకుల, పరుగుల జీవితంతో ఒత్తిడికి గురయ్యే పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు పార్కులు ఎంతగానో ఉపయోగపడతాయని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాల మండలం అంబర్పేట గ్రామంలో నగర వన్ కార్యక్రమం కింద అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అర్బన్ పార్కును ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్’కుమార్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ శుక్రవారం ప్రారంభించారు.
అనంతరం పార్కులో మొక్కను నాటి వాటర్ ప్లాంటేషన్ చేశారు. అర్బన్ పార్క్’లో ఏర్పాటు చేసిన బోర్డు మ్యాప్ ద్వారా పార్క్లో ఉన్న సౌకర్యాలు, మౌలిక వసతులను అటవీశాఖ అధికారులు కలెక్టర్కు వివరించారు. అనంతరం పార్కులో ఏర్పాటు చేసిన బతుకమ్మ ఘాట్, క్లాక్ టవర్ను ప్రారంభిం చారు.
జగిత్యాల జిల్లా ప్రజలకు ఈ పార్క్ ఎంతగానో ఉపయోగ పడుతుందని, జిల్లా ప్రజలు ఈ పార్కుని సందర్శించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్’పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్, జిల్లా ఫారెస్ట్ అధికారి, ఆర్డీవో మధుసూధన్, డిపిఓ మదన్మోహన్, ఎంపీడీవో, ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు.