calender_icon.png 21 April, 2025 | 12:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాత్రలతోనూ పార్కి న్సన్స్‌ను సరిచేయొచ్చు

11-04-2025 12:49:29 AM

  1. బాగా ముదిరితే డీబీఎస్ లాంటి శస్త్రచికిత్సలు
  2. ఎంఆర్జీఎఫ్యూఎస్ తరహా ఆధునిక చికిత్సలు కూడా..
  3. కామినేని ఆస్పత్రి వైద్యుల వెల్లడి

హైదరాబాద్, ఏప్రిల్ 10(విజయక్రాంతి): చేతులు, కాళ్లు వణుకుతూ.. మన శరీరంపై మనకే నియంత్రణ లేని పరిస్థితిని తీసుకొచ్చే ప్రమాదకరమైన వ్యాధి.. పార్కిన్సన్స్. యేటా ఏప్రిల్ 11న ప్రపంచ పార్కిన్సన్స్ డేగా జరుపుకొంటారు. అత్యాధునిక మందులు, సరి కొత్త చికిత్సా విధానాలు ఎప్పటికప్పుడు అం దుబాటులోకి వస్తున్నా, రోగులు సరైన సమయానికి వైద్యులను సంప్రదించడంతో ఈ వ్యాధి లక్షణాలను కొంతవరకు తగ్గించొచ్చని ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రికి చెందిన న్యూరాలజిస్టులు, న్యూరోసర్జన్లు చెబుతున్నారు.

ప్రపంచ పార్కిన్సన్స్ డేని పురస్కరిం చుకొని ఆస్పత్రికి చెందిన సీనియర్ కన్సల్టెం ట్ న్యూరోసర్జన్ డాక్టర్ ఎస్ రమేశ్, విభాగాధిపతి, సీనియర్ కన్సల్టెంట్ న్యూరోసర్జన్, డాక్టర్ కమలేశ్ డీ చౌడ, కన్సల్టెంట్ న్యూరాలజిస్టులు డాక్టర్ ఎం లక్ష్మీలావణ్య, డాక్టర్ నారెడ్డ్డి సందీప్ రెడ్డి మీడియాతో మాట్లాడా రు.

పార్కిన్సన్ ప్రాణాంతకం కాదని, సరైన నిర్ధారణ, నిరంతర వైద్య సంరక్షణతో రోగు లు క్రియాశీల జీవితాన్ని గడపొచ్చని డాక్టర్ ఎస్ రమేశ్, సీనియర్ కన్సల్టెంట్ న్యూరోసర్జన్ తెలిపారు. మెడికల్ ట్రీట్‌మెంట్‌కు స్పం దించని పార్కిన్సన్ రోగులకు ’డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్’ ఉపయోగిస్తామని చెప్పారు. డాక్టర్ లక్ష్మిలావణ్య మాట్లాడుతూ..

మన శరీరంలో ఉండే డొపమైన్ అనే రసాయనం ఉత్పత్తి తగ్గిపోయినప్పుడు పార్కిన్సన్స్ వ్యాధి మొదలవుతుందని.. మెదడులోని నరాలు చచ్చుబడిపోవడం వల్ల ఈ వ్యాధి వస్తుందని వివరించారు. కన్సల్టెంట్ న్యూరోలాజిస్ట్ డాక్టర్ నారెడ్డి సందీప్‌రెడ్డి మాట్లాడుతూ.. మెదడు కు సంబంధించిన సమస్య కాబట్టి.. వీలైనం త వరకు ప్రశాంత చిత్తంతో ఉండేలా చూసుకోవాలన్నారు.