13-02-2025 08:17:56 PM
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్...
పాపన్నపేట: ఏడుపాయల జాతరలో పార్కింగ్ నిర్వహణ పక్కా ప్రణాళికతో జరగాలని, ఏలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు ఏడుపాయల వనదుర్గ అమ్మవారి జాతర పార్కింగ్ ప్రణాళికపై సంబంధిత అదనపు కలెక్టర్ నగేష్, దేవాదాయ, పోలీస్, గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో సమీక్షించారు. ఈ సందర్భంగా జాతరలో పార్కింగ్ ఏర్పాట్ల ప్రణాళికపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్ నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జాతర సందర్బంగా వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రశాంత వాతావరణంలో అమ్మవారిని దర్శించుకునేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ముఖ్యంగా జాతర నిర్వహణ ట్రాఫిక్ అంతరాయం కలగకుండా మూడు రోజులు పార్కింగ్ నిర్వహణ పకడ్బందీగా జాతర చర్యలు చేపడుతున్నామన్నారు. జాతరలో సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధాన్ని పగడ్బందీగా అమలు చేయడానికి గ్రామపంచాయతీ ద్వారా చర్యలు తీసుకుంటున్నామన్నారు. క్షేత్రస్థాయిలో ఏడుపాయల జాతర నిర్వహణ ప్రదేశాలను అధికారులు పరిశీలించుకుని లోటు పాట్లను సవరించుకొని, పగడ్బందీగా జాతర నిర్వహించాలన్నారు. అనంతరం వనదుర్గ అమ్మవారి జాతర నిర్వహణ వాల్ పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, డిపిఓ యాదయ్య, డీఎస్పీ ప్రసన్నకుమార్, ఏడుపాయల టెంపుల్ కార్యనిర్వాహణాధికారి చంద్రశేఖర్ రెడ్డి, సంబంధిత పోలీస్, దేవాదాయ, పంచాయితీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.