నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి
నల్లగొండ, జనవరి 23 (విజయక్రాంతి) : నార్కట్ పల్లి మండలంలోని చెరువుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో గురువారం నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి, నార్కట్పల్లి సీఐ నాగరాజు దేవాలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నవీన్ కుమార్తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు.
దేవాలయ పరిసర ప్రాంతాలు, భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేయనున్న పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించారు. పోలీస్ సిబ్బందికి, ఆలయ అధికారులకు పలు సూచనలిచ్చారు. భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఆయన వెంట నార్కెట్పల్లి పోలీసులు, దేవస్థానం సిబ్బంది శ్రీనివాస్ రెడ్డి తదితరులున్నారు.