calender_icon.png 18 November, 2024 | 1:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్కింగ్ పరేషానీ!

18-11-2024 12:01:34 AM

  1. కమర్షియల్ ఏరియాల్లో స్థల కేటాయింపులకు తిలోదకాలు
  2. అమలుకాని నో పార్కింగ్
  3. రోడ్లపైనే వాహనాల నిలిపివేత
  4. ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు

శేరిలింగంపల్లి, నవంబర్ 1౭ (విజయక్రాంతి): హైదరాబాద్‌లో పార్కింగ్ సమస్య తలనొప్పిగా మారింది. బహుళ అంతస్తు భవనాలతో పాటు కమర్షియల్ బిల్డింగుల వద్ద 25 శాతం పార్కింగ్ ఉండాలన్న నిబంధన అమలు కావడం లేదు. మరోవైపు పెరుగుతున్న రద్దీ కూడా పార్కింగ్ సమస్యల తలెత్తడానికి కారణమవుతోంది.

ట్రాఫిక్‌కు అనుగుణంగా కోట్ల రూపాయలు ఖర్చుచేసి రోడ్లను విస్తరిస్తున్నా ఆశించిన ఫలితం దక్కడం లేదు. జీహెచ్‌ఎంసీ, జలమండలి, హెచ్‌ఎండీఏ తదితర కార్యాలయాల్లోనూ సరైన పార్కింగ్ సౌకర్యం లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి.  

బిల్డర్లపై చర్యలేవీ..

రెసిడెన్షియల్, కమర్షియల్ ఏరియాల్లో 25 శాతం పార్కింగ్ స్థలం కేటాయించని భవనాల్లో కార్యకలాపాలు కొనసాగేందుకు, ఆ భవనాలకు సమీపం లో వ్యాలెట్ పార్కింగ్‌ను ఏర్పాటు చేసి దిద్దుబాటు చర్యలు చేపడుతున్నారు. పార్కింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయని భవనాలపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు వంటి కమర్షియల్ భవనాల్లో పార్కింగ్ స్థలం కేటాయించకుంటే గతంలో జీహెచ్‌ఎంసీ వాటి ట్రేడ్ లైసెన్స్‌ను రద్దు చేసేది. కానీ ప్రస్తుతం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఫలితంగా నిన్నమొన్నటి వరకు రోడ్డుకిరువైపులా కనిపించే అక్రమ పార్కింగ్ ఇప్పుడు రోడ్డు మధ్యలోకి వచ్చేసింది. 

అమలుకాని నో పార్కింగ్

ట్రాఫిక్ సమస్య నివారణకు నగరంలోని పలు చోట్ల ట్రాఫిక్ పోలీసు లు నో పార్కింగ్ బోర్డులు ఏర్పాటు చేశారు. కానీ ఏమాత్రం నిబంధనలు అమలు కావడం లేదు.  ప్రతి కమర్షియల్ కాంప్లెక్స్, సందడి ఎక్కువగా ఉండే షాపుల నుంచి ట్రాఫిక్ పోలీసులకు నెలసరి మామూళ్లు వెళ్లడంతో వారు మౌనం వహిస్తు న్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అక్రమ పార్కిం గ్ విషయంలో ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకో వాలని ప్రజలు కోరుతున్నారు.