calender_icon.png 7 March, 2025 | 3:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైవేపైనే పార్కింగ్..!

07-03-2025 12:00:00 AM

  • ఔటర్ రింగ్ రోడ్డు వద్ద అడ్డగోలుగా పార్కింగ్‌లు
  • ఈ రహదారిపై రోజు వేలాది వాహనాల రాకపోకలు
  • ట్రాఫిక్‌ను నియంత్రించని పోలీసులు

అబ్దుల్లాపూర్ మెట్, మార్చి 6: హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన పెద్ద అంబర్‌పేట్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద వావానాలను అడ్డదిడ్డంగా రోడ్డుపై పార్కింగ్ చేస్తున్నారు.  ఈ ప్రాంతం విజయవాడ జాతీయ రహదారి కావడంతో వేలాది వాహనాలు ఈ రహదారిపై రాకపోకలు సాగుతాయి. ఇవే కాకుండా గడ్డి అన్నారం మార్కెట్ బాటసింగారంలో ఉడడంతో మార్కెట్ వచ్చే వాహనాల రద్దీకూడా దీనికి తోడవుతుంది.

చుట్టు ప్రక్కన ఇంజినీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వీటి వలన ఈ ప్రాంతం వెళ్లవేళాల రద్దీగా ఉంటుంది. భారీ వాహనాలు విజయవాడ జాతీయ రహదారికి ఇరువైపుల రోడ్డుపై పార్కింగ్‌లు చేయడం చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి.

అదే విధంగా ఈ రోడ్డుకు అనుకొని వ్యాపారులు హోటల్స్, టీ స్టాల్స్ బేకరీలు, రెస్టారెంట్స్ నిర్వహిస్తుండడంతో హోటల్స్, బేకరీలు, రెస్టారెంట్స్‌కు వచ్చే వారు కూడా రోడ్డుపై పార్కింగ్ చేస్తుండడంతో.. బైక్‌పై వెళ్లేవారు, కారులో వేళ్లేవారు నానా ఇబ్బందులు గురికాడమేకాకుండా... ప్రమాదాలకు భారీన కూడా పడుతున్నారు.

ట్రాఫిక్‌ను నియంత్రించాల్సిన ట్రాఫిక్ పోలీసులు ఎప్పుడు కనిపించారని స్థానికులు, వాహనాదారులు ఆరోపిస్తున్నారు. చలాన్లపై ఉన్న శ్రద్ద ట్రాఫిక్ నియంత్రించడపై కూడా  దృష్టి పెట్టాలని స్థానికులన్నారు.   

ఇరువైపులా హోటల్స్, టీ స్టాల్స్... 

ఓఆర్‌ఆర్ వద్ద ఇరువైపులా హోటల్స్, టీ స్ఠాల్స్ ఉండడంతో వాహన చోదకులు భోజనం చేయడానికి హోటల్స్ కు వచ్చినప్పుడు రోడ్డుపై పార్కింగ్ చేస్తున్నారు. దీంతో వాహనాల రద్దీ మరింత పెరుగుతుంది.  భారీ వాహనాలు సైతం రోడ్డుపై యథచ్చేగా పార్కింగ్ చేస్తున్నారు. ఇవే కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే భారీ డ్రకులు, లారీలు, డీసీఎంలు వస్తుంటాయి. మధ్యాహ్నం సమయంలో ఓఆర్ ఆర్ వద్ద పరిస్థితి చాలా దారుణంగా ఉటుంంది.

రోడ్డుకు ఇరు వైపులా ఎక్కడ బడితే.. అక్కడ భారీ వాహనాలతో మొదలుకొని... ఫోర్ వీలర్ ట్రాన్స్‌పోర్ట్ వాహనాల వరకు అడ్డదిడ్డంగా రోడ్డుపై పార్కింగ్‌లు చేస్తుంటారు. ఇవే కాకుండా ఓఆర్‌ఆర్ వద్ద వచ్చక అడ్రస్‌ల పేరుతో గంటల తరబడి రోడ్డుపై పార్కింగ్‌లు చేస్తుంటారు. ఫలితంగా టూ వీలర్ వాహనాలుదారులు, ఫోర్ వీలర్(కారు) వాహనాదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు.

కనిపించని “ట్రాఫిక్ పోలీసులు

పెద్ద అంబర్‌పేట్ ఔటర్ రింగ్ రోడ్డు విజయవాడ జాతీయ రహదారి ఉండడంతో అనునిత్యం వాహనాలతో రద్దీగా ఉంటుంది. ఓఆర్‌ఆర్ వద్ద భారీ డ్రక్కులు, కంటైనర్లు, లారీలు, డీసీఎంలు ఇరువైపులా వాహనాలు పార్కింగ్ చేయడంతో ఇతరు వాహనాదారులు నానా తంటలు పడుతున్నామని వాహనాదారులు వాపోతున్నారు. ఎవ్వరైనా వీఐపీలు వచ్చినప్పుడు తప్ప.. మిగత సమయాలలో “ట్రాఫిక్ పోలీసులు రోడ్డు కనిపించారని వాహనాదారులు ఆరోపించారు.

చర్యలు తీసుకుంటాం

ఓఆర్‌ఆర్ వద్ద పార్కింగ్ చేసే చాలా చలా న్లు విధించాము. వాహనాలను పార్కింగ్ స్థలంలో పార్కింగ్ చేయాలని ప్లేక్సిల్ కూడా పెట్టాం. రోడ్డు ఇరువైపుల చిన్న.. చిన్న హోటల్ ఉండడంతో.. ఇతర రాష్ట్రాలకు చెందిన వాహన డ్రైవర్లు, క్లీనర్ వారు అక్కడే భోజనం చేస్తుంటారు. తక్కువ ఖర్చుతో కూడుకున్నది కనుక. ప్రతి రోజు మా సిబ్బందితో పెట్రోలింగ్ నిర్వహిస్తూనే ఉన్నాం. ఇక మీదట రోడ్డుపై పార్కింగ్ చేసే వాహనాదారులపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం.

  బి. గట్టుమల్లు, వనస్థలిపురం ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్