జగిత్యాల అర్బన్, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): ఇంటి ముందర పార్కు చేసిన కారును పట్టపగలు గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేసిన సంఘటన జగిత్యాల పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణంలోని హౌ సింగ్ బోర్డులో రామాలయం వెనక పార్క్ చేసి ఉన్న షిఫ్ట్ కారును గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి దగ్ధం చేశారు.
అక్కడే ఉన్న స్థానికులు గమ నించి వెంటనే నీళ్లు పోసి మంటలను ఆర్పారు. వినయ్ అనే వ్యక్తి తన ఇంటి ముందు ఉదయం కారును పార్క్ చేసి ఉంచి వెళ్లిన తర్వాత మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు.
దాదాపు రూ. 2 లక్షల వరకు నష్టం జరిగిందని తెలిపాడు.విషయం తెలిసిన పోలీసులు ఘటన స్థలానికి చేసుకొని ప్రమాద తీరును ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.