16-04-2025 12:30:25 AM
ఎల్బీనగర్, ఏప్రిల్ 15: ఎల్బీనగర్ నియోజకవర్గంలో పార్కుల లొల్లి మొదలైంది. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కాంగ్రెస్, బీజేపీ కార్పొరేటర్ల మధ్యన అధిపత్యం కోసం ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతుంది. తమ మాటే నెగ్గాలని ఎప్పుడూ లేని విధంగా ప్రోటోకాల్ వివాదం రగులుకున్నది. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో తన చేతుల మీదుగా ప్రారంభించిన పార్కుల అభివృద్ధి పనులపై తన మాటే నెగ్గాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఉన్నా రు.
అయితే, పార్కు అభివృద్ధి పనులు పూర్తయ్యేసరికి ప్రభుత్వాలు మారాయి. ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉండడంతో స్థానికు కాంగ్రెస్ కార్పొరేటర్లు మా మాటే నెగ్గాలనే పంతం పట్టారు. దీంతో ఇటీవల కాలంలో పార్కుల విషయంపై ఎల్బీనగర్ ని యోజకవర్గంలో వివాదం నెలకొంది.
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన పార్కుల అభివృద్ధి పనులు పూర్తయినా ఇప్పటికీ ప్రారంభించ లేదని... పనులు పూర్తయిన పార్కులను నేనే ప్రారంభిస్తానని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రకటించారు. దీంతో వివాదం రగులుకున్నది. జిల్లా ఇన్ చార్జి మంత్రితో మీమే ప్రారంభిస్తామని కాంగ్రెస్ కార్పొరేటర్ల ప్రకటించారు.
ఇటీవల మంత్రి శ్రీధర్ బాబు ఎల్బీనగర్ నియోజకవర్గంలో పర్యటించి, రూ. 118 కోట్లతో చేప ట్టిన, చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. అయితే, ఈ క్రమంలో వనస్థలిపురంలోని ఒ క పార్కుపై వివాదం రగులుకున్నది. వనస్థలిపురంలోని బీకేఎస్ గ్రౌండ్ లో చేపట్టిన అభివృద్ధి పనులను ఐదు రోజుల క్రితం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పరిశీలించారు.
ఈ క్రమంలో పార్కు పనులు నిలిపివేయాలని కాంట్రాక్టర్ ని ఎమ్మెల్యే ఆదేశించారు. పార్కు లో పనులను నిలిపివేయడంపై స్థానిక మ హిళలు నిలదీశారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని ప్రశ్నించారు. బీకేఎస్ గ్రౌండ్ ని పార్కుగా అభివృద్ధి చేయాలని మహిళలు కోరారు. గ్రౌండ్ ని క్రీడా మైదానంగా చేస్తామని, పిల్ల లు, యువకులకు ఆడుకోవడానికి సరైన స్థలం లేదని, బీకేఎస్ పార్కు స్థలాన్ని క్రీడా మైదానంగా చేస్తామని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు.
బీకేఎస్ గ్రౌండ్ సమీపంలో నాలుగు పార్కులు ఉన్నాయని... పిల్లలు, యువకులు ఆడుకోవడానికి సరైన స్థలం లేదని వివరించారు. అయితే, ఎమ్మెల్యే నిర్ణయాన్ని స్థానిక మహిళలు అడ్డుకున్నారు. ఖాళీగా ఉన్న బీకేఎస్ గ్రౌండ్ లో యువకు లు, ఆకతాయిలు ఆక్రమించి, అల్లరి చేస్తున్నారని, అర్దరాత్రి వేళలో మద్యం తాగి, గొడవ లకు దిగుతున్నారని మహిళలు ఆరోపించారు.
బర్త్ డే పార్టీలు అంటూ రాత్రి వేళల్లో యువకులు హంగామా చేస్తున్నారని ఎమ్మెల్యేకు చెప్పారు. బీకేఎస్ గ్రౌండ్ అభివృద్ధిపై గతంలో ఇరువర్గాల అభిప్రాయం తీసుకున్నామని... క్రీడా మైదానంగా చేయాలని అప్పుడు అందరూ ఒప్పుకున్నారని... ఇప్పు డు అడ్డుకోవడం సరికాదని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు.
పార్కు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే అడ్డుకోవడంపై కాంగ్రెస్ కార్పొరేటర్లు మండిపడుతున్నారు. స్థానికుల కోసం పార్కును నిర్మిస్తుంటే ఎమ్మెల్యే అడ్డుకోవడం సరికాదన్నారు. ఉనికి కోసమే ఎమ్మెల్యే చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
ఉనికి కోసమే ఎమ్మెల్యే చిల్లర రాజకీయం
ఎల్బీనగర్ నియోజకవర్గంలో రాజకీయ ఉనికి కోసమే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభు త్వం మంజూరు చేసిన నిధులతో మీము అభివృద్ధి పనులు చేస్తుంటే ఎమ్మెల్యే తట్టుకోలేక పోతున్నారు. తనకు పేరు రాదనే ఈర్ష్యతో ఎమ్మెల్యే ఉన్నారు. ఎల్బీనగర్ ని యో జకవర్గ అభివృద్ధికి బీఆర్‌ఎస్ ప్రభు త్వం నిధులు ఇవ్వలేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో ఒక్కో డివిజన్ కు రూ. 14 కోట్లు కేటాయించింది. మా ప్రభుత్వం ఇచ్చిన నిధులతో అభివృద్ధి పనులు చేస్తుంటే ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారు. మీము ప్రారంభించిన పనులను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కొబ్బరికాయలు కొట్టి, తిరిగి ప్రారంభిస్తున్నారు. ఎల్బీ నగర్ లో సుధీర్ రెడ్డి ఒంటరిగా ఉన్నారు.. ఉనికి కోసమే ఎమ్మెల్యే రాజకీయాలు చేస్తున్నారు.
- రాగుల వెంకటేశ్వర్ రెడ్డి,
వనస్థలిపురం డివిజన్ కార్పొరేటర్.