25-03-2025 12:00:00 AM
ఆకుల సతీష్
కుత్బుల్లాపూర్, మార్చ్ 24(విజయ క్రాంతి): కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చింతల్, భగత్ సింగ్ నగర్‌లో ఉన్న దోబీ ఘాట్ ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్ లో అక్రమ నిర్మాణాలను తొలగించి, తక్షణమే ఆ స్థలంలో పార్కు ఏర్పాటు చేయాలని చింతల్ కాలనీ ప్రజలతో కలిసి ఆకుల సతీష్ డిప్యూటీ కమిషనర్ మల్లారెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆకుల సతీష్ మాట్లాడుతూ దోబీ ఘాట్ ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్ లో గత సంవత్సరం నవంబర్ నుండి దాదాపు 2000 గజాల స్థలాన్ని బిఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకులు ఆక్రమిం చి గదులు నిర్మిస్తూ పేదలకు అమ్ము తూ సొమ్ముచేసుకుంటున్నారన్నా రు.
ఈ అక్రమ నిర్మాణాలపై గతంలో ఫిర్యాదు చేసిన ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. తక్షణమే ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్ లో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించి, పార్కు ఏర్పాటు చేయాలని అలాగే జగద్గిరిగుట్ట పైప్ లైన్ నుండి వచ్చే 30 ఫీట్ల నాలను పునరుద్ధరించి అందమైన ప్రదేశంగా తీర్చిదిద్దాలని కమిషనర్‌కు తెలిపారు. ఈ కార్యక్రమంలో చింతల్ డివిజన్ బీజేపీ సీనియర్ నాయకులు సదానంద,నల్ల జై శంకర్ గౌడ్, మాజీ అధ్యక్షులు పత్తి సతీష్, డివిజన్ అధ్యక్షులు రాజేష్ చారి, జీడిమెట్ల డివిజన్ మాజీ అధ్యక్షులు పులి బలరామ్, జితేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, బిజెవైఎం అసెంబ్లీ కో-కన్వీనర్ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.