calender_icon.png 26 October, 2024 | 2:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారిస్ ఒలింపిక్స్ నీరజ్ చోప్రా సారథ్యంలో

05-07-2024 01:44:51 AM

న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొననున్న భారత అథ్లెటిక్స్ బృందానికి జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా నేతృత్వం వహించనున్నాడు. మొత్తం 28 మందితో కూడిన అథ్లెట్ల బృందం ఒలింపిక్స్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇందులో 17 మంది పురుషులు, 11 మంది మహిళా అథ్లెట్లు ఉన్నారు. పారిస్ వేదికగా జూలై 26 నుంచి ఆగస్టు 19 వరకు విశ్వక్రీడలు జరగనున్నాయి. తెలుగు అథ్లెట్లు జ్యోతీ ఎర్రాజీ, దండి జ్యోతిక శ్రీతో పాటు జావెలిన్ త్రో విభాగంలో నీరజ్, కిషోర్‌కుమార్ జెనాలు పోటీ పడనున్నారు. ఒలింపిక్స్‌లో ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీలు ఆగస్టు 1 నుంచి 11 వరకు జరగనున్నాయి. ఈసారి విశ్వక్రీడల్లో పురుషుల 50 కిమీ రేస్ వాక్‌ను తొలగించిన ఒలింపిక్ కమిటీ మిక్స్‌డ్ రిలే ఈవెంట్‌లో మారథాన్ రేస్ వాక్‌ను ప్రవేశపెట్టనుంది.

ఒలింపిక్స్‌కు భారత జట్టు:

పురుషులు: నీరజ్ చోప్రా, కిషోర్‌కుమార్ జెనా (జావెలిన్ త్రో), అవినాశ్ సబ్లే (స్టీపుల్‌చేజ్), తేజిందర్‌పాల్ (షాట్‌పుట్) ప్రవీణ్ చిత్రవేల్, అబుల్లా అబూబకర్ (ట్రిపుల్ జంప్), ఆక్ష్‌దీప్ సింగ్, వికాస్ సింగ్, పరమ్‌జీత్ సింగ్ (20కిమీ రేస్ వాక్), మహమ్మద్ అనస్, మహమ్మద్ అజ్మల్, అమోజ్ జాకబ్, సంతోష్ తమిళరాసన్, రాజేశ్ రమేశ్, మిజో చాకో కురియన్ (4x400మీ రిలే), సూరజ్ పన్వర్ (మిక్స్‌డ్ మారథాన్ రేస్ వాక్ ), సర్వేశ్ అనిల్ కుషారే (హైజంప్).

మహిళలు: జ్యోతి ఎర్రాజీ (100 మీ హర్డిల్స్), జ్యోతిక శ్రీ దండి, సుభా వెంకటేశన్, విథ్యా రామ్‌రాజ్, పూవమ్మ (4x400 మీ రిలే), కిరణ్ పహాల్ (400 మీ), పారుల్ చౌదరీ (స్టీపుల్ చేజ్), అన్నూ రాణి (జావెలిన్ త్రో), అభా కతువా (షాట్ పుట్), ప్రాచీ (4x400 మీ), ప్రియాంక గోస్వామి (రేస్ వాక్ మిక్స్‌డ్ మారథాన్).