calender_icon.png 18 January, 2025 | 2:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంబురాల పారిస్

27-07-2024 04:54:37 AM

పారిస్: ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా నాలుగేళ్లకోసారి జరిగే ఒలింపిక్ విశ్వక్రీడల ఆరంభ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగింది. గతానికి భిన్నంగా సీన్ నదిపై నిర్వ హించిన ప్రారంభోత్సవ కార్యక్రమం కన్నుల పండువగా నిర్వహించారు. కరోనా మహమ్మారి కారణంగా గత టోక్యో ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకలను ఒలింపిక్ నిర్వాహక కమిటీ ఘనంగా నిర్వహించలేకపో యింది.  అయితే ఈసారి మాత్రం పారిస్ వేదికగా జరుగుతున్న విశ్వక్రీడలను ఘనం గా నిర్వహించాలని ముందే పక్కా ప్రణాళికను రూపొందించారు. అందులో భాగంగా పారిస్‌లోని సీన్ నదిపై 90 పడవల్లో 6800 మందికి పైగా అథ్లెట్లు  విహరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సీన్ నది నుంచి ఈఫిల్ టవర్ వరకు 6 కిమీ మేర నిర్వహించిన పరేడ్‌లో అథ్లెట్లు ఉత్సాహంగా పాల్గొ న్నారు. మొత్తం మీద 16 రోజుల పాటు జరగనున్న విశ్వక్రీడల్లో 206 దేశాల నుంచి 10వేలకు పైగా అథ్లెట్లు.. 32 క్రీడాంశాల్లో 329 ఈవెంట్లలో పోటీ పడనున్నారు.

సింధు, శరత్ కమల్ సారథ్యంలో..

కోట్ల మంది భారతీయుల ఆశల పల్లకిని మోస్తూ 117 మందితో కూడిన భారత అథ్లెట్ల బృందం సగర్వంగా పరేడ్ కార్యక్రమంలో పాల్గొంది. టేబుల్ టెన్నిస్ (టీటీ) స్టార్ ఆచంట శరత్ కమల్, తెలుగు స్టార్ షట్లర్ పీవీ సింధు జాతీయ జెండాను చేబూని పతకాదారులుగా వ్యవహరించారు. వీరిద్దరిని అనుసరిస్తూ ఆర్చర్ దీపికా కుమారి, బాక్సర్ లవ్లీనా బొర్గోహై, టీటీ ప్లేయర్ మనిక బాత్రా, టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న సహా మొత్తం 78 మంది భారత అథ్లెట్లు, అధికారులు ముందుకు నడిచారు. నేడు ఏడు విభాగాల్లో పోటీలు ఉండడంతో పలువురు క్రీడాకారులు ప్రారంభోత్సవానికి దూరంగా ఉన్నారు. వీరిలో భారత పురుషుల హాకీ జట్టు, రోయర్ బల్‌రాజ్ పన్వర్‌లు ఉండగా.. ట్రాక్ అండ్ ఫీల్డ్, వెయిట్ లిప్టింగ్, రెజ్లింగ్ క్రీడాకారులు పారిస్‌కు కాస్త ఆలస్యంగా చేరుకోనుండడంతో వేడుకలకు దూరమయ్యారు.

తొలి రోజు ఏడు క్రీడాంశాల్లో..

నేటి నుంచి మొదలుకానున్న పారిస్ ఒలింపిక్ క్రీడల్లో తొలిరోజు ఏడు క్రీడాంశాల్లో భారత అథ్లెట్లు బరిలోకి దిగనున్నారు. బ్యాడ్మింటన్, బాక్సింగ్, హాకీ, రోయింగ్, టేబుల్ టెన్నిస్, షూటిం గ్, టెన్నిస్ క్రీడాంశాల్లో భారత క్రీడాకారులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. బ్యాడ్మింటన్ విభాగంలో పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్, డబుల్స్ విభాగంలో బరి లోకి దిగనున్న సాత్వి క్ సాయిరాజ్ శెట్టి జోడీపై భారీ ఆశలున్నాయి. ఇక టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యంతో మెరిసిన భారత పురుషుల హాకీ జట్టు న్యూజిలాండ్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. టెన్నిస్ విభాగంలో బోపన్న జంట తొలి రౌండ్ మ్యాచ్ ఆడనుంది. షూటింగ్‌లో మనూ బాకర్, రిథమ్ సంగ్వాన్, సరబ్ జోత్ సహా మిగతావాళ్లు పోటీ పడనున్నారు.

నేడు భారత్ పాల్గొననున్న క్రీడాంశాలు..

బ్యాడ్మింటన్: 

పురుషుల సింగిల్స్:

లక్ష్యసేన్ x కెవిన్ కోర్డాన్ (గౌటేమలా)

పురుషుల డబుల్స్: 

సాత్విక్ సాయిరాజ్‌ె చిరాగ్ శెట్టి x లుకాస్ లాబర్ (ఫ్రాన్స్)

మహిళల డబుల్స్: 

అశ్విని పొన్నప్ప x కిమ్ సో యోంగ్ హీ యోంగ్ (కొరియా)

బాక్సింగ్ :

మహిళల 54 కేజీల విభాగం: 

ప్రీతి పవార్ x తి కిమ్ అన్హ్ వో (వియత్నాం)

హాకీ :

పురుషుల పూల్ 

భారత్ x న్యూజిలాండ్ 

రోయింగ్:

పురుషుల సింగిల్స్ స్కల్స్ పోటీలు: పన్వర్ బల్‌రాజ్

టేబుల్ టెన్నిస్ : 

పురుషుల సింగిల్స్ ప్రిలిమినరీ రౌండ్: 

హర్మీత్ దేశాయ్ x జయిద్ 

అబో యమన్ (జోర్డాన్)

టెన్నిస్ :

పురుషుల డబుల్స్ తొలి రౌండ్: 

రోహన్ బోపన్న-------- బాలాజీ x రోగర్ వాసెలిన్- 

రిబౌల్ (ఫ్రాన్స్)

షూటింగ్ :

10 మీటర్ల రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ క్వాలిఫికేషన్: సందీప్ సింగ్ అర్జున్ బబౌతా జిందాల్

పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్: అర్జున్ సింగ్ చీమా, సరబ్‌జోత్ సింగ్ 

మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్: మనూ బాకర్, 

రిథమ్ సంగ్వాన్