09-02-2025 12:47:24 PM
ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన యువ డాక్టర్ భూమిక
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్
ఆమె అవయవాలను నలుగురికి దానం చేసిన తల్లిదండ్రులు
రాజేంద్రనగర్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన ఓ యువ డాక్టర్ తాను చనిపోతూ నలుగురికి ప్రాణం పోసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.. నార్సింగి మేకన్ గడ్డ వద్ద ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదం లో యువ వైద్యుడు యశ్వంత్ మృతి చెందగా వైద్యురాలు భూమిక తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలైంది. భూమిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయింది. తన అవయవాలను ఆమె తల్లిదండ్రులు దానం చేశారు. గుండె, లివర్, కళ్ళు, కిడ్నిలు దానం చేశారు. భూమిక చనిపోతూ నలుగురికి ప్రాణదానం చేయడం అభినందనీయమని పలువురు కొనియాడారు. భూమిక మృతితో ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రం మునిగిపోయారు.