calender_icon.png 28 October, 2024 | 1:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కస్తూర్బా విద్యార్థుల ఆరోగ్యంపై తల్లిదండ్రులు ఆందోళన వద్దు..

28-10-2024 11:51:25 AM

విద్యార్థులకు వైద్య సిబ్బంది మెరుగైన చికిత్స అందిస్తున్నారు

పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినిలను పరామర్షలో మంత్రి శ్రీధర్ బాబు

పెద్దపల్లి (విజయక్రాంతి): ముత్తారం మండల కస్తూర్బా గాంధీ బాలికల విద్యార్థుల ఆరోగ్యంపై తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని, విద్యార్థులకు వైద్య సిబ్బంది మెరుగైన చికిత్స అందిస్తున్నారని, పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినిల పరామర్షలో మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఆదివారం రాత్రి ముత్తారం కస్తూర్బా విద్యార్థినిలు తీవ్రమైన దగ్గు రావడంతో హుటాహుటిన ఉపాధ్యాయులు మండల వైద్య సిబ్బంది పెద్దపెల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చి చికిత్స అందిస్తున్నారు.

సోమవారం ఉదయం మంత్రి ఆసుపత్రి వద్ద మాట్లాడుతూ.. విద్యార్థులు ఆరోగ్యంగానే ఉన్నారని ఎవరు ఎలాంటి ఆందోళన చెందవద్దని వైద్య సిబ్బంది వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నారని, కొంతమంది విద్యార్థులు ఇంటికి వెళ్లిపోయారని చికిత్స పొందుతున్న విద్యార్థులు కూడా కోల్కొని తల్లిదండ్రులు ఇంటికి తీసుకుపోతారని తెలిపారు. విద్యార్థులకు ఉన్నట్టుండి ఒక్కసారి ఇలా దగ్గు రావడంపై విచారణ చేస్తున్నామని త్వరలోనే కస్తూర్బా పాఠశాలను అధికారులు ఉన్నతాధికారులకు సందర్శించి అన్ని విషయాలు తెలుపుతారన్నారు. ప్రభుత్వం గురుకుల, కస్తూర్బా, మోడల్ తదితర పాఠశాలలపై ప్రత్యేక నిఘా ఉంచి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నామని మంత్రి తెలిపారు. మంత్రి వెంట జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, జిల్లా వైద్యాధికారి ప్రమోద్, ముత్తారం మాజీ జడ్పిటిసి చొప్పరి సదానందం, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొడ్ల బాలాజీ, నాయకులు కాచే శేశిభూషన్, డి సి డి ఓ కవిత, తదితరులు ఉన్నారు.