23-02-2025 12:00:00 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): హైదరాబాద్ దత్తాత్రేయ కాలనీలోని ఎస్‌ఆర్ పబ్లిక్ స్కూల్‌లో శనివారం తల్లిదండ్రుల పూజా దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి ప్రిన్సిపాల్ శ్వేత అధ్యక్షత వహించి, తల్లిదండ్రులను ఆహ్వానించారు. విద్యార్థులచేత తమ తల్లిదండ్రులకు పూజా కార్యక్రమాలు నిర్వహిం పజేశారు. ఈ కార్యక్రమానికి 120 మంది తల్లిదండ్రులు హాజరయ్యారు.