01-03-2025 11:43:54 AM
జీ స్కూల్ యాజమాన్యం డౌన్ డౌన్ అంటూ నినాదాలు
హైదరాబాద్: హైదరాబాద్ లో ఫీజుల పెంపునకు నిరసనగా హయత్ నగర్ లోని జీ స్కూల్(Zee High School) వద్ద ఆందోళన చేపట్టారు. ఒకేసారి 30 శాతం ఫీజులు పెంచడంపై విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన చేపట్టారు. జీ స్కూల్ ఎదుట రహదారిపై విద్యార్థుల తల్లిదండ్రులు ర్యాలీ నిర్వహించారు. జీ స్కూల్ యాజమాన్యం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఒకేసారి భారీ మొత్తం లో ఫీజులు పెంచితే ఎలా భరించాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెంచిన ఫీజులు తక్షణమే తగ్గించాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.