calender_icon.png 23 February, 2025 | 10:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫీజులు పెంచారని విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన

15-02-2025 11:26:50 PM

హయత్‌నగర్,(విజయక్రాంతి): ఫీజులు అధికం పెంచారని శుక్రవారం విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ ఎదుట ఆందోళన చేపట్టారు. హయత్‌నగర్‌లోని పాతరోడ్డులో ఉన్న జీ స్కూల్‌లో ప్రతి విద్యా సంవత్సరం ఫీజులు పెంచుతున్నారని ఆరోపిస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... హయత్‌నగర్‌లోని జీ హై స్కూల్లో ప్రతి ఏడాది 30 నుంచి 50 శాతం ఫీజులు అధికంగా పెంచుతున్నారని అన్నారు. ఇలా పెంచుకుంటూ పోతే ఎలా అంటూ నిలదీశారు. దీంతో యాజమాన్యం స్పందిస్తూ ఈ విషయంపై వారం తరువాత మాట్లాడతామని అక్కడి నుంచి విద్యార్థుల తల్లిదండ్రులను పంపించారు.