calender_icon.png 27 April, 2025 | 9:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రాక్టర్‌తో ఢీకొట్టి తల్లిదండ్రుల హత్య

27-04-2025 12:23:13 AM

  1. సోదరికి ఆస్తి ఇచ్చారని..

ఏపీ విజయనగరం జిల్లాలో ఘటన

హైదరాబాద్, ఏప్రిల్ (26): ఆస్తి లో చెల్లికి వాటా ఇచ్చారని తల్లిదండ్రులను ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపాడో కొడుకు. ఈ దారుణ ఘటన ఏపీలోని విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం నడిపూరికల్లాలులో చోటు చేసుకుంది. నడిపూరికల్లాలుకు చెంది న అప్పలనాయుడు (55), జయ (45) దంపతులకు కొడుకు రాజశేఖర్, ఓ కూతురు ఉన్నారు. ఆస్తిలో చెల్లికి వాటా ఇవ్వడంతో తల్లిదండ్రులపై రాజశేఖర్ కక్ష పెంచుకున్నాడు.

ఈ విషయమై కుమారుడితో తల్లిదండ్రులకు కొంతకాలంగా వివాదం కొన సాగుతోంది. శనివారం చెల్లికి ఇచ్చిన భూమిని రాజశేఖర్ ట్రాక్టర్‌తో చదు ను చేస్తుండగా అప్పలనాయుడు, జయ అడ్డుకున్నారు. వారితో వాగ్వాదానికి దిగిన రాజశేఖర్ ట్రాక్టర్‌తో గుద్ది తల్లిదండ్రులను చంపేశాడు.