10-02-2025 08:58:39 AM
అశ్వరావుపేట,(విజయక్రాంతి): తాను మనసు పడిన బుల్లెట్ బండిని కొనివ్వలేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన అశ్వరావుపేట పట్టణంలో చోటుచేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం కేంద్రం పరిధిలోని ఫైర్ కాలనీకి చెందిన చీకటి కొండయ్య, వరలక్ష్మి దంపతుల కుమారుడు స్వామి (30) కారు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.స్వామి తనకు బుల్లెట్ ద్విచక్ర వాహనం కొనివ్వాలని గత కొద్దిరోజులుగా తల్లిదండ్రులను అడుగుతున్నాడు. డబ్బులు వచ్చిన తర్వాత కొనిస్తామంటూ తల్లిదండ్రులు జాప్యం చేస్తూ వస్తున్నారు.
ఆదివారం ఉదయం 6:30 గంటల సమయంలో స్వామి తనకు బుల్లెట్ బండి కొని ఇవ్వాలని పట్టుబట్టగా రెండు రెండు రోజుల్లో కొందామని చెప్పి తండ్రి కొండయ్య తన పనికి బయలుదేరుతాడు. తల్లి వరలక్ష్మి కూడా బయటకు వెళ్ళగానే ఇంట్లో స్వామి ఎవరులేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లి ఇంటికి వచ్చి చూడగా కుమారుడు వేలాడుతుండటంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు అప్పటికే వైద్యులు అతడు మృతి చెందిన ధృవపరిచారు. స్వామి అవివాహతుడని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.