calender_icon.png 11 April, 2025 | 3:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంతాన సాఫల్య సదస్సు

26-03-2025 12:00:00 AM

నోవా ఐవీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహణ

హైదరాబాద్, మార్చి  25 (విజయక్రాంతి): నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ, ద ఆబ్స్టెట్రిక్ అండ్ గైనకలాజికల్ సొసైటీ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో నగరంలోని తాజ్‌కృష్ణ హోటల్‌లో మంగళవా రం సంతాన సాఫల్య సదస్సు నిర్వహించారు. నగరవ్యాప్తంగా ఉన్న గైనకాలజి స్టులు, ఫెర్టిలిటీ నిపుణులు సుమారు 500 మందికి పైగా దీనికి హాజరయ్యారు. తెలంగాణలో సంతానోత్పత్తి, సంతాన సాఫల్య రేటు గణనీయంగా పడిపోతోందని ఆందోళన చెందారు.

జీవనశైలిలో మార్పులు, ఆలస్యంగా గర్భం దాల్చడం, పురుషుల్లో వంధ్యత్వం, జీవితంలో పెరుగుతున్న ఒత్తిడి లాంటి అంశాలు స్త్రీపురుషులలో సంతానరాహిత్య రేటు పెరగడానికి కారణం అవుతున్నాయన్నారు. ఈ సమస్యలపై చర్చించేందుకు, అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ (ఏఆర్టీ)లో ఆధునిక పరిణామాల గురించి తెలుసుకునేందుకు చర్చించారు.

పునరుత్పత్తి ఆరోగ్యంపై అవగాహనను వ్యాప్తి చేయడానికి, అత్యాధునిక సంతానసాఫల్య చికిత్సలు అందించడానికి నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ కట్టుబడి ఉన్నదన్నారు. వంధ్యత్వానికి చికిత్సలలో తాజా పరిణామాలు, సమస్యలు, పరిష్కారాలపై చర్చించేందుకు ఈ రంగంలోని నిపుణులందరినీ ఒకచోటకు తీసుకురావడంలో ఈ సీఎంఈ ఒక మంచి ముందడుగు వేసిందన్నారు.

సంతానసాఫల్య నిపుణులంతా కూడా పిల్లలను కనే విషయాన్ని ఆలస్యం చేయకూడదని నొక్కి చెప్పారు. ఒకవేళ పిల్లలు ఆలస్యంగా కావాలనుకుంటే ముందుగానే పురుషులు, మహిళలు తమ వీర్యం, అండాలను ఫ్రీజ్ చేయించుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో బంజారాహిల్స్ నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ సంతానసాఫల్య నిపుణురాలు డాక్టర్ హిమదీప్తి, కూకట్‌పల్లి నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ డాక్టర్ సరోజ కొప్పల మాట్లాడారు. ముఖ్య అతిథులుగా ఎఫ్‌ఐజీవో గౌరవ కోశాధికారి డాక్టర్ శాంతకుమారి, ప్రసూతి, గైనకాలజికల్ సొసైటీ ఆఫ్ హైదరాబాద్ కార్యదర్శి డాక్టర్ మంజులరావు, నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ బంజారాహిల్స్‌కు చెందిన డాక్టర్ దుర్గా వైట్ల, ఎల్‌బీనగర్‌కు చెందిన డాక్టర్ దివ్యరెడ్డి పాల్గొన్నారు.