calender_icon.png 8 November, 2024 | 12:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తల్లిదండ్రుల పోషణ పిల్లల బాధ్యత

08-11-2024 10:02:05 AM

వృద్ధ దంపతులను సన్మానిస్తున్న సిఐ శ్రీను, ఎస్ఐ అపూర్వ రెడ్డి పోలీస్ బృందం

సిద్దిపేట (విజయక్రాంతి): కని పెంచిన తల్లిదండ్రులను మంచిగా చూసుకోవడం మన బాధ్యత, తల్లిదండ్రులను మించిన దేవుళ్ళు ఎవరూ లేరని సిద్దిపేట రూరల్ సిఐ శ్రీను అన్నారు. సిద్దిపేట రూరల్ ఎస్ ఐ అపూర్వ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద లింగారెడ్డి పల్లి గ్రామంలో పోలీస్ కళాబృందం చే కనువిప్పు కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ శ్రీను పాల్గొని మాట్లాడారు. పిల్లల ప్రవర్తనను గమనించవలసిన బాధ్యత తల్లిదండ్రులదని, అవసరం మేరకే సెల్ ఫోన్ వాడాలని, గూగుల్ పే, ఫోన్ పే చేసేటప్పుడు జాగ్రత్త వహించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు, రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. గంజాయి, మత్తు పదార్థాలపై  ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. యువకులు, విద్యార్థులు ఎక్కడికి వెళ్తున్నారు.

ఏం చేస్తున్నారు, ఎలాంటి స్నేహితులతో తిరుగుతున్నారో గమనిస్తూ ఉండాలన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మానవ తప్పిదం వల్లే సైబర్ నేరాలు జరుగుతున్నాయని చెప్పారు.  ఏదైనా సైబర్ నేరం జరిగితే వెంటనే 1930 కాల్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు. గ్రామంలో సిసి కెమెరాల ఏర్పాటుకు ప్రజాప్రతినిధులు, వ్యాపారస్తులు సహకరించాలని కోరారు. మూఢనమ్మకాలు నమ్మవద్దని సూచించారు. కనువిప్పు కార్యక్రమానికి హాజరైన వృద్ధ తల్లిదండ్రులను పోలీసులు ఘనంగా సన్మానించారు. సిద్దిపేట పోలీస్ కళాబృందం సభ్యులు బాలు, రాజు, తిరుమల, తెలంగాణ సాంస్కృతిక సారథి బృందం సభ్యులు రవి, రవీందర్, ఎల్లయ్య, తిరుమలయ్య, భార్గవి, నాటకం, పాటల రూపంలో ప్రజలకు అవగాహన కల్పించారు.