calender_icon.png 16 February, 2025 | 2:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతీ నెల మూడవ శనివారం అన్ని పాఠశాలలలో పేరెంట్ టీచర్ సమావేశాలు

15-02-2025 06:17:36 PM

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): ప్రతి నెల మూడవ శనివారం అన్ని పాఠశాలల్లో తప్పనిసరిగా పేరెంట్స్ కమిటీ సమావేశాన్ని నిర్వహించాలని విద్యాశాఖ కోఆర్డినేటర్ నాగరాజు శేఖర్(Education Coordinator Nagaraju Shekhar) స్పష్టం చేశారు. శనివారం పలు మండలాల్లో పాఠశాలలను అకస్మికంగా తనకి నిర్వహించారు. చుంచుపల్లి మండలంలోని ఎంపీయూపీఎస్. పెనుబల్లి, సుజాతనగర్ మండలం లోని జెడ్పీహెచ్ఎస్ సుజాతనగర్ పాఠశాలలను వారు సందర్శించారు. పెనుబల్లి పాఠశాల తరగతి గదిలో ఉపాధ్యాయులు టీచింగ్ లెర్నింగ్  మెటీరియల్ ను వినియోగించుకొని పాఠ్యంశ బోధన చేయడం పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా  ఆయన మాట్లాడుతూ... పాఠశాల అభివృద్ధికి తల్లిదండ్రుల, గ్రామస్థుల సహకారం చాలా అవసరమని, విద్యార్థుల విద్యాభివృద్ధిలో తల్లిదండ్రులను భాగస్వాములను చేయాలని సూచించారు.

మధ్యాహ్న భోజన నిర్వహణలో అలసత్వం లేకుండా, మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించేందుకు ప్రధానోపాధ్యాయులు, నిర్వహణ ఏజెన్సీ వారు తగు చర్యలు చేపట్టాలన్నారు. సుజాతనగర్ హైస్కూల్ లో SSC విద్యార్థులతో మమేకమై SSC పరీక్షలు కేవలం నెల రోజు ల్లోనే ప్రారంభం కానున్న సందర్బంగా విద్యార్థులకు ప్రిపరేషన్ టెక్నిక్స్ ను తెలియజేసి, పరీక్షల పట్ల భయం లేకుండా పరీక్షలు ఎలా వ్రాయలో విద్యార్థులకు  అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం లో జిల్లా కమ్యూనిటీ మోబిలైజేషన్ అధికారి యస్. కె. సైదులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నరు.