18-04-2025 09:32:01 PM
చేగుంట,(విజయక్రాంతి): చేగుంట మండల కేంద్రానికి చెందిన గోరంట్ల వెంకటేశం ఇటీవల చెరువులో పడి మరణించిన విషయం తెలుసుకున్న ప్రముఖ సంఘ సేవకులు అయిత పరంజ్యోతి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి దశ దిన కర్మకు ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో జూకంటి రాజు, మ్యాకల రవి, సతీష్ అశోక్ చాట్ల సంతోష్, శ్రీను యాదగిరి, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.