calender_icon.png 16 January, 2025 | 6:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరాగ్వే సుందరి అందంతో జనాలంతా పరార్

09-08-2024 03:56:01 PM

పారిస్: అందమా నీ పేరేమిటి అందమా..? అని ఎవరైనా అడిగితే ఒలింపిక్ విలేజ్ అంతా పరాగ్వే సుందరి పేరు లువానా అలోన్సా పేరు చెబుతున్నారు. జూలై 27న జరిగిన 100 మీటర్ల ఉమెన్స్ బటర్ ఫ్లై విభాగంలో పోటీలలో ఓడిపోయారు. 0.24 సెకన్ల తేడాతో సెమీ ఫైనల్స్ చేజారినప్పటికీ ఆగస్ట్ 11 వరకు క్రీడలు ముగిసే వరకు పారిస్ లో  అక్కడే ఉండే ఏర్పాటు చేశారు. అంతే లువానా ఏం చక్కా స్విమ్ సూట్ లో  తిరగడం మొదలు పెట్టింది. దీంతో ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగా పెరిగిపోవటంతో సొంత స్విమ్మింగ్ జట్టు సైతం చిరాకు పడింది. తన అందంతో తమ క్రీడాకారులను పరధ్యానంలో పడేస్తుందని భావించిన పరాగ్వే జట్టు ఆమెను పొంత దేశానికి పంపించింది. కానీ కొస మెరుపు.. ఏమిటంటే పారిస్ నుంచి తన సొంత దేశానికి వెళ్లిన ఆమె మరుసటి రోజే రాజీనామా చేసింది.