calender_icon.png 15 January, 2025 | 11:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్‌కు చేరుకున్న పారా అథ్లెట్స్

06-09-2024 01:40:20 AM

న్యూఢిల్లీ: పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ తరఫున పాల్గొన్న పారా అథ్లెట్లు కొంత మంది న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. మొదటి బ్యాచ్ పారా అథ్లెట్ల బృందం ఇండియాకు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. వీరికి ఘన స్వాగతం లభించింది. 

పారా అథ్లెట్లతో మంత్రి

కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ  పతకాలు సాధించిన పారా అథ్లెట్లతో సమావేశం అయ్యారు. 

నేడు హైదరాబాద్‌కు దీప్తి

పారాలింపిక్స్‌లో మహిళల 400 మీటర్ల టీ20 ఈవెంట్‌లో కాంస్యపతకం నెగ్గిన దీప్తి జివాంజి నేడు నగరానికి రానుంది. ఉదయం 9 గంటల సమయంలో శంషాబాద్ విమానాశ్రయానికి రానున్న దీప్తికి తెలంగాణ స్పోర్ట్స్ అకాడమీ తరఫున ఘనంగా స్వాగత ఏర్పాట్లు చేశారు. దీప్తి జివాంజిది వరంగల్ జిల్లా.