మణుగూరు ఇంచార్జ్ జిఎం లక్ష్మీపతి గౌడ్...
మణుగూరు (విజయక్రాంతి): సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ వ్యాప్తంగా ఏప్రిల్ 1వ తేదీ నుండి పేపర్ లెస్ విధానం కానుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏరియా ఇంచార్జ్ జిఎం టి లక్ష్మీపతి గౌడ్ అన్నారు. శుక్రవారం ఏరియా జిఎం కార్యాలయంలో నిర్వహించిన ఏరియాలోని గనులు, వివిధ విభాగాల అధికారులకు పేపర్ లెస్ విధానంపై సింగరేణి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ఒక్కరోజు శిక్షణను ఇచ్చారు. సందర్భంగా ఇన్చార్జీ జిఎం లక్ష్మిపతి గౌడ్, బిజిఎం (ఐటి), పిఎం (ఈ ఆర్ పి) హర ప్రసాద్ లు మాట్లాడారు. ఇప్పటివరకు సింగరేణి వ్యాప్తంగా ఉత్తర ప్రత్యుత్తరాలు సర్కులర్లు కాగితాలపైన జరుగుతున్నాయని ఇకనుంచి అన్ని రకాల ఉత్తర ప్రత్యుత్తరాలు SAP ద్వారా మాత్రమే జరగడానికి SAP ఫైల్ మేనేజ్మెంట్ సిస్టం అనే ప్రోగ్రాంను తయారు చేశారన్నారు. ఈ విధానం ద్వారా సమయం ఆదా అవడమే కాకుండా కాగితం వాడకం పూర్తిగా తగ్గించుకోవచ్చన్నారు.
దీని కోసమే సింగరేణి యాజమాన్యం ఈ నిర్ణయాన్ని తీసుకొని మొదటి విడతగా అన్ని ఏరియాలలో అధికారులకు సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ ప్రక్రియ వలన సమాచారం మొత్తం ఆన్ లైన్ లో ఎప్పటికీ భద్రంగా ఉంటుంది కాబట్టే ఈ నూతన విధానాన్ని కొనసాగించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్‌ఓటు జిఎం డి శ్యామ్ సుందర్ , ఏజిఎం(సివిల్) డి వెంకటేశ్వర్లు, మణుగూరు ఓసి ప్రాజెక్ట్ అధికారి శ్రీనివాస చారి, డిజిఎం(పర్సనల్) ఎస్ రమేశ్, ఏఎస్‌ఓ డి. వెంకట రామారావు, డిజిఎం(పర్చేస్) శ్రీనివాస మూర్తి, డిజిఎం(ఐఈడి) కే వెంకట్ రావు, డిజిఎం(ఓసి స్టోర్స్)పి రామకృష్ణ, డిజిఎం(కేసిహెచ్‌పి) మధన్ నాయక్, డా. శేషగిరి రావు, ప్రాజెక్ట్ మేనేజర్(పికేఓసి) డి రాంబాబు, సెక్యూరిటి ఆఫీసర్ కే శ్రీనివాస్, సీనియర్ ఎస్టేట్స్ అధికారి బాబుల్ రాజ్, మేనేజర్ ఎంవిటిసి నాగేశ్వర రావు, మేనేజర్(ఐటి) ఈఆర్‌పి కిరణ్ కుమార్, సీనియర్ ఐటి ప్రోగ్రామర్ సాయిల సురేశ్, సీనియర్ ఐటి ప్రోగ్రామర్ ఈఆర్‌పి శంకర్, సర్వే అధికారి సర్వర్ HBబీ, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ రవి శ్రీనివాస్, ప్రోగ్రామ్మర్(ఐటి) ఈఆర్‌పి రమ్య తదితర అధికారులు పాల్గొన్నారు.