calender_icon.png 3 October, 2024 | 5:49 AM

పేపర్ వెండర్స్‌ను ఆదుకోవాలి

02-10-2024 02:28:51 AM

ప్రింట్ మీడియా డిస్ట్రిబ్యూటర్ అసోసియేషన్

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 1 (విజయక్రాంతి): చిమ్మ చీకట్లను చీల్చుకుంటూ సూర్యుడు ఉదయించక ముందే.. ‘సార్ పేపర్’ అంటూ పాఠకుడి తలుపు తట్టి నిద్రలేపి వార్తను చేరవేసే పేపర్ వెండర్ పరిస్థితి నేడు దయనీయంగా మారింది. మంగళవారం చిక్కడపల్లిలోని కళా నాట్యమండలి లో జరిగిన సమావేశంలో తెలంగాణ ప్రింట్ మీడియా డిస్ట్రిబ్యూటర్ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ..

కరోనా అనంతరం డిజిటలైజేషన్ పెరిగిపోవడంతో ప్రస్తు తం పేపర్ వెండర్స్ పరిస్థితి చాలా దయణీయంగా మారిపోయిందని వారు వాపోతు న్నారు. తెలంగాణ పేపర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వెండర్స్‌ను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 28వేల మంది ఇప్పటికీ పేపర్ వెండర్లుగా ఉన్నారని.. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వారందరికి పేపర్ డెలివరీ చేయడానికి ఈశూబైక్స్‌లో రాయితీ, మహిళా సంఘాలకు ఇచ్చినట్లు వడ్డీ లేని రుణాలతో పాటు హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు ఇవ్వాలని వారు కోరుతున్నారు.