calender_icon.png 31 October, 2024 | 7:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బయట పేపర్ లీకేజీ.. లోపల భవనం లీకేజీ

02-08-2024 01:42:17 AM

నూతన పార్లమెంట్ భవనం లాబీలో పైకప్పు లీకేజీ

లోక్‌సభలో కాంగ్రెస్ వాయిదా తీర్మాణం

బిల్డింగ్ నాణ్యతపై విపక్షాల విమర్శలు

న్యూ ఢిల్లీ, ఆగస్టు 1: దేశ రాజధాని ఢిల్లీలోని నూతన పార్లమెంట్ భవనంలోని లాబీలో నీటి లీకేజీ వ్యవహారం అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. నీటి లీకేజీ అంశంపై లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాకూర్ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టగా.. సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ బీజేపీ ప్రభుత్వాన్ని దుయ్యపట్టారు. రూ.వేల కోట్లు వెచ్చించిన నిర్మాణంలో నీటి లీకేజీ జరగడం ఏంటని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పాత పార్లమెంట్ భవనంలోనే సభ కొనసాగించాలని డిమాండ్ చేశారు.  కాగా.. భవనం లాబీపై గాజు గోపురాలు అంటించిన ప్లేస్‌లో కొద్దిగా గమ్‌లాంటి పదార్థం తొలిగిపోవడంతో వర్షపు నీరు లోపడికి వచ్చిందని ప్రభుత్వం తెలిపింది. రూ.20వేల కోట్ల సెంట్రల్ విస్టా  ప్రాజెక్టులో భాగమైన కొత పార్లమెంట్ భవనాన్ని 2023 మే 28న ప్రధాని మోదీ ప్రారంభించారు.