బొప్పాయి పండు కడుపుకు మంచిదని భావిస్తారు. అయితే బొప్పా యి ఆకులతో అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ఇటీవల బొప్పాయి ఆకులరసం, దాని ఆరోగ్య గుణాలు ప్రాచుర్యం పొందింది. బొప్పా యి ఆకుల రసం తాగడం వల్ల జీర్ణక్రియతోపాటు ఆరోగ్యకరమైన కాలేయం వరకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు.
జీర్ణ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు. బొప్పాయి ఆకు రసం చాలా మేలు చేస్తుంది. ఇది జీర్ణవ్యవస్థను శుభ్రపరుస్తుంది. మంటను తగ్గిస్తుంది. పేగుల్లో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరుగుదలకు సహాయపడుతుంది. డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నవారికి బొప్పాయి ఆకు రసం బాగా పనిచేస్తుంది. ఇది ప్లేట్లెట్ కౌంట్స్‌ను పెంచుతుంది. ఇది డెంగ్యూ బారిన పడిన వ్యక్తులు ప్లేట్లెట్ సమస్యతో బాధపడుతుంటారు. బొప్పాయి ఆకు రసాన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల ప్లేట్లెట్ సంఖ్య మెరుగుపడతాయని తేలింది.
బొప్పాయి ఆకులలో విటమిన్ సి, విటమిన్ ఇ, అనేక యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి, ఇవి శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షిస్తాయి. గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బొప్పాయి ఆకులలో ఉండే ఆల్కలాయిడ్స్ శరీరంలో మంటను తగ్గించ డంలో సహాయపడతాయి. కీళ్ల నొప్పులు, కండరాల నొప్పితో బాధపడేవారికి ఇది ఉపశమనంగా ఉంటుంది. అలాగే ఇది కాలేయాన్ని శుభ్రపరుస్తుంది.