పాపన్నపేట: రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో పాపన్నపేట మండల పరిధిలోని చీకోడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థి శివ చైతన్య ఉత్తమ ప్రతిభ కనబరిచి దక్షిణ భారతస్థాయి విజ్ఞాన ప్రదర్శనలకు ఎంపికయ్యాడు. గురువారం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో జరిగిన రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో మల్టీపర్పస్, మల్టీ కాన్సెప్ట్యువల్, అడ్వాన్స్ హైడ్రాలిక్ జెసిబి అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఫ్యూచర్ ట్రాన్స్ పోర్ట్ ఆల్ ఇన్ వన్ వెహికిల్ ఆనే అంశంపై చక్కటి ప్రదర్శన కనబరిచి ప్రథమ బహుమతి పొంది దక్షిణ భారత స్థాయికి ఎంపికయ్యాడని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థి శివ చైతన్య, గైడ్ టీచర్, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు కిషన్ ప్రసాద్ లను మండల విద్యాధికారి ప్రతాప్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయ లక్ష్మి అభినందించారు.