calender_icon.png 3 April, 2025 | 10:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక పాపన్న

03-04-2025 12:35:11 AM

హైదరాబాద్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి):  బహుజన పోరాట యోధు డు, తెలంగాణ బహుజన ఆత్మగౌరవానికి, ధీరత్వానికి ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి హరీశ్‌రావు కొనియాడారు. బుధవారం సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి పురస్కరించుకొని ఘనమైన నివాళి అర్పించారు.

రాజకీయ, సామాజిక సమానత్వం కోసం పాపన్న చేసిన కృషి ఎనలేనిదన్నారు. సర్వాయి పాపన్న గొప్పతనా న్ని చాటడానికి ప్రతి ఏటా వారి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని అప్ప టి కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు.