ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్
దుబాయ్: బోర్డర్ గావస్కర్ సిరీస్‌లో భాగంగా ఆసీస్‌తో జరిగిన ఐదో టెస్టు లో మెరుపు అర్థసెంచరీ సాధించిన టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో మెరిశాడు. బుధవారం వి డుదల చేసిన ర్యాంకింగ్స్‌లో బ్యాటింగ్ విభాగంలో మూడు స్థానాలు ఎగబాకిన పంత్ (739 పాయింట్లు) తొమ్మిదో స్థానంలో నిలవగా.. ఓపెనర్ జైస్వాల్ (847 పాయింట్లు) నాలుగో స్థానం నిలబెట్టుకున్నాడు.
ఈ ఇద్ద రు మినహా భారత బ్యాటర్లలో ఒక్కరు కూ డా కనీసం టాప్-20లో చోటు దక్కించుకోలేకపోయారు. బౌలింగ్ విభాగంలో భారత పేసుగుర్రం బుమ్రా (908 పాయింట్లు) నంబర్‌వన్ స్థానాన్ని కాపాడుకోగా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఒక స్థానం ఎగబాకి (745 పాయింట్లు) తొమ్మిదో స్థానంలో నిలిచాడు.
ఆల్‌రౌండర్ల విభాగంలో జడేజా (400 పాయింట్లు) నంబర్‌వన్ ర్యాంకులోనే కొనసాగుతున్నాడు. భారత్‌తో సిరీస్‌లో విశేషంగా రాణించిన ఆసీస్ కెప్టెన్ కమిన్స్ రెండో ర్యాంకులో నిలవగా, స్కాట్ బోలండ్ 10 స్థానాలు ఎగబాకి టాప్-10లో అడుగుపెట్టాడు. సౌతాఫ్రికా పేసర్ కగిసో రబాడ మూడో స్థానంలోఉండగా.. ఆసీస్ పేసర్ హాజిల్ వుడ్ నాలుగో స్థానానికి పడిపోయాడు.