ఆసీస్ ఆలౌట్ అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియాకు జైస్వాల్ (22), రాహుల్ (13) తొలి వికెట్‌కు 42 పరుగులు జోడించారు. రాహుల్ ఔటైన తర్వాత వచ్చిన గిల్ (13), కోహ్లీ (6) మరోసారి నిరాశపరిచారు.
ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన పంత్ (33 బంతుల్లో 61; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) దనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. టెస్టుల్లో పంత్ (29 బంతుల్లో) రెండో వేగవంతమైన అర్థసెంచరీ అందుకున్నాడు. గతంలో లంకపై 28 బంతుల్లోనే అర్థశతకం సాధించిన పంత్ భారత్ తరఫున ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన జాబితాలో తొలి స్థానంలో ఉన్నాడు.