24-02-2025 12:11:23 AM
గ్రామంలో భయాందోళనలు
బాన్సువాడ, ఫిబ్రవరి 23 (విజయ క్రాంతి): క్షుద్ర పూజల కలకలం రేపుతు న్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి ఆ గ్రామంలోని ఇండ్ల ముందు నిమ్మకా యలు పసుపు కుంకుమ క్షుద్ర పూజల అనువాల్లు కనిపిస్తూ ఉండడంతో ఆ గ్రామ స్తులు భయాందోళనకు గురవుతున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్ కేంద్రంలోని బీర్కూరు మండల మూలోని రైతునగర్లో గ్రామంలో ఆదివారం తెల్లవారు జామున పలు ఇళ్ల ఎదుట క్షుద్ర పూజల ఘటన కలకలం రేపుతుంది. దీంతో గ్రామ స్తులు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో కొంత మంది ఇళ్ల ముందు రాత్రి సమయంలో నిమ్మకాయలు, కుంకుమ, పసుపు, బియ్యం, బొమ్మలు పెట్టి ఎవరో క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నారని తెలిపారు. కావాలని తమ ఇళ్ల ముందు పూజలు చేస్తున్నారని బాధితులు పేర్కొంటున్నారు. ఈ విషయమై గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి.