01-05-2024 12:10:00 AM
పానీపూరి అంటే ఇష్టపడని వారుంటారా? అలా టైంపాస్‌కు బయటకు వెళ్లి ప్లేట్ల కొద్ది పానీపూరీలు లాగించేవాళ్లు వేలల్లో ఉంటారు. ఎందుకంటే టేస్ట్‌కు టేస్ట్.. ధర కూడా మనకు అందుబాటులోనే ఉంటుంది కాబట్టి.. రెండు, మూడు ప్లేట్లు ఎంచక్కా బొజ్జలో వేసేస్తాం. అయితే ముంబైలోని చత్రపతి శివాజీ ఎయిర్‌పోర్టులో దొరికే పానీపూరి తినాలంటే మాత్రం ఒక్కసారి పర్సును తడిమి చూసుకోవాల్సిందే. లేదంటే ఉన్న డబ్బులన్నీ అయిపోయి విమానం ఎక్కకుండానే తిరిగి ఇంటికి వచ్చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ పానీపూరి ధర తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే. ఇక్కడ పానీపూరి ప్లేటు (8 పూరీలు) ధర ఎంతో తెలుసా ఏకంగా రూ.333. ఈ విషయాన్ని షుగర్ కాస్మెటిక్స్ సహ వ్యవస్థాపకుడు కౌశిక్ ముఖర్జీ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఓ పోస్టు చేశారు. దీంతో ఈ పోస్టు తెగ వైరల్ అవుతోంది.