calender_icon.png 8 January, 2025 | 4:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పానీపూరీవాలా @ 40 లక్షలు

06-01-2025 01:33:00 AM

  • బ్యాంక్ లావాదేవీలు చూసి అధికారుల బిత్తర
  • జీఎస్టీ చెల్లించాలని నోటీసులు అందజేత

చెన్నై, జనవరి 5: రోడ్డు పక్కన పానీపూరీ అమ్మే ఓ వ్యక్తి ఏడాదిలో జరిపిన బ్యాంక్ లావాదేవీలు చూసిన జీఎస్టీ అధికారులు బిత్తరపోయారు. నిబంధనల ప్రకారం జీఎస్టీ చెల్లించాలంటూ సదరు వ్యక్తికి నోటీసులు అందించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి రోడ్డు పక్కన పానీపూరీ అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు.

కాగా అతడు గతేడాది తన అకౌంట్ నుంచి రూ.40 లక్షలకు పైగా లావాదేవీలో చేశాడు. దీంతో అధికారులు అతడికి డిసెంబర్ 17న జీఎస్టీ నోటీసులు ఇచ్చారు. రోడ్డు పక్కన నడుపుతున్న దుకాణాలు జీఎస్టీ పరిధిలోకి రావు. స్ట్రీట్ వెండర్స్ నడుపుతున్న వ్యాపారులు, ముఖ్యంగా పానీపూరీవాలాలు జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ ఆన్‌లైన్ లావాదేవీల ప్రకారం.. ప్రభుత్వం నిర్ణయించిన దానికంటే ఎక్కువ మొత్తం లో లావాదేవీలు జరిపే వ్యాపారుకు జీఎస్టీ విధిస్తున్నారు.