అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్న పాంగోలిన్ (అలుగు)
విదేశాల్లో రూ.లక్షల్లో విలువ!
నాగర్‌కర్నూల్, నవంబర్ 11 (విజయక్రాంతి): విదేశాల్లో రూ.లక్షల్లో విలుజేసే పాంగోలిన్ (అలుగు) మూగజీవిని అమ్మేందుకు తరలిస్తున్న ముఠాను అటవీ శాఖ అధికా రులు అరెస్టు చేశారు. సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం హాజిపూర్ వద్ద అటవీ శాఖ అధికారులు మరో పాంగోలిన్ మూగజీవిని తరలిస్తున్న ముఠాను పట్టుకున్నారు.
ఇందులో అమ్రాబాద్, మద్దిమడుగు ప్రాంతానికి చెందిన 8 మంది ఆదివాసీలు, జడ్చర్ల ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి హైదరాబాద్‌కు చెందిన మరో ఇద్ద రు మొత్తం 11 మంది పోలీసుల అ దుపులో ఉన్నట్లు తెలిసింది. పాం గోలిన్ మూగజీవిని సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. దీనిపై జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ రోహిత్ గోపిడి విచారణ జరుపుతున్నారు.