calender_icon.png 7 February, 2025 | 5:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహమ్మారిపట్ల అప్రమత్తత అవసరం

07-02-2025 01:22:40 AM

నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): మహిళల్లో రోజురోజుకు పెరుగుతున్న గర్భాశయ ముఖ ద్వార, బ్రెస్ట్ క్యాన్సర్ వంటి మహమ్మారి పట్ల ప్రజలు అత్యంత జాగ్రత్తలు వహించాలని ప్రతి ఆరు మాసాలకు ఒకసారి తప్పనిసరిగా పరీక్షలు జరిపిం చాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జ్ సబిత అన్నారు.

గురువారం ఇంటర్నేషనల్ క్యాన్సర్ డే సందర్భంగా జిల్లా జనరల్ ఆసుపత్రిలోని రోగులను పరామర్శించి క్యాన్సర్ పట్ల అవగాహన కల్పిస్తూ పలు సూచనలు చేశారు. వారితోపాటు  ఇంచార్జీ సూపరిండెంట్ డాక్టర్ రవి శంకర్, ఆర్‌ఎంఓ అబ్దుల్ అజీమ్, డిప్యూటీ వైద్యాధికారి వెంకట్ దాస్, ప్రోగ్రామ్ ఆఫీసర్ కృష్ణ మోహన్, మెడికల్ ఆఫీసర్స్, న్యాయవాదులు మధుసూదన్ రావు, ఎస్‌ఆర్ సత్యనారాయణ, శ్యాం ప్రసాద్ రావు, లక్మయ్య, న్యాయ శాఖ ఉద్యోగులు  ఎం కేశవ రెడ్డి, ఎన్ రాజు, బాల రాజు, వంశీ తదితరు లు పాల్గొన్నారు.