calender_icon.png 2 October, 2024 | 6:00 PM

పందిళ్లపల్లి చెరువు ఫలహారం!

02-10-2024 12:20:43 AM

  1. యథేచ్ఛగా శిఖం భూముల కబ్జా 
  2. కోట్ల విలువైన భూమి అన్యాక్రాంతం
  3. హద్దుల గుర్తింపులో యంత్రాంగం నిర్లక్ష్యం
  4. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులపై ఆరోపణలు

నల్లగొండ, అక్టోబర్ 1 (విజయక్రాంతి): నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ శివారులోని పందిళ్లపల్లి చెరువు శిఖం భూమి భారీగా ఆక్రమణకు గురైంది. యాద్గార్‌పల్లి, మిర్యాలగూడ శివార్లలోని సర్వేనంబర్లు 32, 118లో దాదాపు 480 ఎకరాలకుపైగా విస్తీర్ణంలో ఈ చెరువు విస్తరించి ఉంది.

కబ్జా దారుల కన్నుపడటంతో ప్రస్తుతం ఇది సగానికిపైగా కుచించుకుపోయింది. మిర్యాలగూ డ వాణిజ్య పరంగా బాగా అభివృద్ధి చెందడంతో భూముల విలువలకు రెక్కలు వచ్చా యి. దీంతో చెరువు శిఖం భూములు, ప్రభు త్వ స్థలాలను కొందరు యథేచ్ఛగా ఆక్రమిస్తున్నారు.

రూ. కోట్ల విలువైన భూములు ఆక్రమణకు గురవుతున్నా అధికారులు పట్టి ంచుకోకపోవడం అనుమానాలకు తావిస్తోం ది. అప్పుడప్పుడు హడావిడి చేసి తూతూమంత్రంగా కేసులు నమోదు చేస్తున్నా అక్ర మార్కులపై చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. 

బంచరాయి, శిఖం భూములు స్వాహా 

పందిళ్లపల్లి చెరువును ఆనుకొని 114 సర్వే నంబర్‌లో 128 ఎకరాలకుపైగా బంచరాయి భూమి, 116, 117 సర్వే నంబర్లలో కొంత పట్టా భూమి ఉంది. పట్టాభూముల ను ఆసరాగా చేసుకొని కొందరు బంచరా యి భూమిని ఆక్రమిస్తున్నారు. రాత్రికిరాత్రే ఇష్టానుసారంగా మట్టిపోసి చదును చేసినా పట్టించుకునే వారేలేరు.

గతంలోనే ఈ సర్వే నం బర్‌లోని భూమిని సర్వే చేస్తామని రెవెన్యూ అధికారులు చెప్పినా ఇప్పటి వరకు చేయకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. చెరు వు భూమిని కాపాడాలని పలుమార్లు అధికారులకు ఫిర్యాదు ఇచ్చినా బుట్టదాఖలయ్యాయని స్థానిక రైతులు చెప్తున్నారు.

గతం లో స్థానిక సీపీఐ నాయకులు అప్పటి ఆర్డీ వో శ్రీనివాసరావును కలిసి ఫిర్యాదు చేసినా ప్రయోజనం కనిపించలేదు. గతంలో భూమిని ఆక్రమణకు సహకరించి ఓ అధికారికి ఓ కబ్జాదారుడు తాను కబ్జా చేసిన భూమిలోనే ౬ గుంటలు సమర్పించినట్టు ఆరోపణలు రావడం ఇక్కడి కబ్జా పర్వానికి అద్ధం పడుతున్నది. 

అటకెక్కిన సుందరీకరణ పనులు 

పందిళ్లపల్లి చెరువును మినీట్యాంక్ బం డ్‌గా తీర్చిదిద్దేందుకు గత బీఆర్‌ఎస్ ప్రభు త్వం 2017లో దాదాపు రూ.7 కోట్లు మం జూరు చేసింది. ఇందులో 3 కోట్ల 70 లక్షల తో కట్ట వెడల్పు, అలుగులు, తూములను పునరుద్ధరించారు. సుందరీకరణ పనులు మాత్రం మరిచారు. సుందరీకరణలో భా గంగా నెక్లెస్ రోడ్డు నిర్మాణానికి రామచంద్రగూడెం నుంచి బోటింగ్ పార్క్ వరకు చెరు వుశిఖం భూమి నుంచే మట్టి రోడ్డు పోశారు. సీసీ వేయాల్సి ఉండగా అప్పటికే ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో పనులు నిలిచాయి. దీంతో రోడ్డు వెంట ఉన్న శిఖం భూమిని కొందరు కబ్జా పెడుతున్నారు. 

దర్జాగా ఆక్రమణ

ఉమామహేశ్వర స్వామి ఆలయ వెనుక దాదాపు ఎకరన్నర చెరువు శిఖం భూమి కబ్జా కు గురైంది. ౪ నెలల క్రితం చెరువులో నీళ్లు లేకపోవడంతో బడాబాబులు, అక్రమార్కులు కొందరు చెరువులోని మట్టినే తవ్వి శిఖంలో పోసి చదువును చేశారు. హద్దులను సైతం ఏర్పాటు చేసి చుట్టూ ఫెన్సింగ్ వేశారు.

కబ్జా గురైన ఈ భూమి విలువ రూ.10 కోట్లకుపై గా ఉంటుందని అంచనా. అప్పట్లో ఈ విషయం స్థానికంగా దుమారం రేగడంతో హడావిడి చేసిన అధికారులు హద్దులను ఏర్పాటు చేస్తామని చెప్పి చేతులు దులుపుకున్నారు. కానీ నేటికి అది కార్యరూపం దాల్చలేదు. 

త్వరలో హద్దులు ఏర్పాటు చేస్తాం 

ఇప్పటికే చెరువు భూములను సాంకేతికంగా సర్వే చేశాం. ఉన్నతాధికారుల నుంచి హద్దుల వివరాలు అందగానే వెంటనే హద్దురాళ్లు ఏర్పాటు చేస్తాం. చెరువుల కబ్జాలను ఉపేక్షించబోం. ఫిర్యాదు చేస్తే ఎంతటివారైనా చర్యలు తీసుకుంటాం. 

 జనార్దన్, నీటిపారుదల డీఈ