calender_icon.png 4 March, 2025 | 5:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంచాయతీ కార్మికుల వేతనాలను విడుదల చేయాలి

04-03-2025 01:40:31 AM

సీఐటీయూ నాయకులు

 నారాయణపేట మార్చి 3(విజయక్రాంతి)  ః నారాయణపేట జిల్లాలోని వివిధ గ్రామ పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులకు గత నాలుగు నెలలుగా వేతనాలు పెండింగ్లో ఉన్నాయని వెంటనే విడుదల చేయాలని కోరుతూ జిల్లా గ్రామ పంచాయతీ అధికారి కృష్ణకు సిఐటియు జిల్లా అధ్యక్షులు వెంకట్రామరెడ్డి , సిఐటియు జిల్లా కార్యదర్శి బాల్ రామ్ సోమవారం రోజు వినతిపత్రం అందజేశారు.

నాలుగు నెలలుగా వేతనాలు అందకపోవడంతో కార్మికులు అప్పుల పాలవుతున్నారని డిపిఓ దృష్టికి తీసుకెళ్లారు ,వేతనాలు వెంటనే విడుదల చేయాలని కోరారు.దీనికి స్పందించిన జిల్లా అధికారి  రెండు మూడు రోజుల్లో కార్మికుల ఖాతాలలో వేతనాలు పడే విధంగా చూస్తామని హామీ ఇచ్చారనీ వారు తెలిపారు.