18-04-2025 12:01:36 AM
మేడ్చల్, ఏప్రిల్ 17 (విజయ క్రాంతి): ఐదు నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులు గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు వేతనాలు విడుదల చేయాలని నినాదాలు చేశారు. డిపిఓ కార్యాలయంలో మెమోరాండం సమర్పించారు.
ఈ సందర్భంగా తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఐదు నెలలుగా వేతనాలు అందనందున కార్మికుల పరిస్థితి దుర్భరంగా తయారైంది అన్నారు. వెంటనే వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మేడ్చల్ జిల్లా కోశాధికారి ఉన్ని కృష్ణన్, పంచాయతీ కార్మిక నాయకులు సుధాకర్, ఆరోగ్యం, ప్రశాంత్, శ్రీనివాస్, కృష్ణ, రాములమ్మ తదితరులు పాల్గొన్నారు.