10-04-2025 01:04:55 AM
మేడ్చల్ అర్బన్ ఏప్రిల్ 9(విజయ క్రాంతి) పంచాయతీ కార్మికులకు ఐదు నెలలుగా వేతనాలు అందనందున ఈనెల 12వ తేదీ నుంచి సమ్మె చేయడానికి సిద్ధమవుతున్నారు. తెలంగాణ గ్రామ పంచాయతి ఎం ప్లాయిస్ &వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సమ్మెకు మద్దతు ఇవ్వాలని పంచాయతీ కార్మికులు మేడ్చల్, శామీర్ పేట్, మూడు చింతలపల్లి, మండలాలలోని ఇంటింటా కరపత్రాలను పంచారు.
న్యాయమైన సమస్యను పరిష్కరించాలని కార్మికుల కడుపు కొట్టొద్దని వారం రోజులు సమ్మె చేయబోయే కార్మికులకు మూడు మండలాల ప్రజలు మద్దతు తెలపాలని కోరారు ఇట్టి విషయంపై ప్రభుత్వం స్పందించకపోతే గ్రామాలలో శానిటేషన్ తో పాటు విద్యుత్ మంచినీటి సరఫరాలను సైతం నిలిపివేస్తామని తెలిపారు.