calender_icon.png 4 October, 2024 | 7:02 AM

పంచాయతీ ఓటర్లు 1,67,33,548

04-10-2024 01:12:35 AM

తుది జాబితా విడుదల

పురుషులు 82 లక్షలు, మహిళలు 85 లక్షల పైనే 

నల్లగొండ జిల్లాలో అత్యధికం.. మేడ్చల్‌లో అత్యల్ప ఓటర్లు  

హైదరాబాద్, అక్టోబర్ 3 (విజయక్రాంతి): గ్రామపంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు వేగవంతం చేసింది. ఇందు కోసం తాజాగా పంచాయతీల ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది. రాష్ట్రంలోని 538 మండలాల్లో మొత్తం 12,867 గ్రామ పంచాయతీలు ఉండగా, 1,13,722 వార్డులు ఉన్నాయి.

వీటిలో మొత్తం 1,67,33,548 మంది ఓటర్లు ఉన్నారని ఈసీ పేర్కొంది. మొత్తం పంచాయతీ ఓటర్లలో 82,04,518 మంది పురుషులు, మహిళా ఓటర్లు 85, 28,573, ఇతరులు 493 మంది ఉన్నట్టు స్పష్టం చేసింది. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 10,42,545 మంది ఓటర్లు ఉండ గా, అత్యల్పంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా లో 64,397 మంది ఓటర్లు ఉన్నారు.

జిల్లాలవారీగా పంచాయతీ ఓటర్లు

ఆదిలాబాద్ 4,41,795

భద్రాద్రి కొత్తగూడెం 6,23,947

హనుమకొండ 3,65,832

జగిత్యాల 5,93540

జనగామ 4,09,797

భూపాలపల్లి 2,90,663

జోగులాంబ గద్వాల 3,88,195

కామారెడ్డి 6,36,362

కరీంనగర్ 5,27,237

ఖమ్మం 8,52,878

ఆసిఫాబాద్ 3,48,370, 

మహబూబాబాద్ 5,52,192

మహబూబ్‌నగర్ 5,16,183

మంచిర్యాల 3,78,934

మెదక్ 5,12,278

మేడ్చల్ 64,397

ములుగు 2,37,858

నాగర్‌కర్నూల్ 6,46,407

నల్లగొండ 10,42,545

నారాయణపేట 4,03,748

నిర్మల్ 4,40,651

నిజామాబాద్ 8,30,580

పెద్దపల్లి 4.07,716

రాజన్న సిరిసిల్ల 3,46,259

రంగారెడ్డి 7,94,653

సంగారెడ్డి 8,34,360

సిద్దిపేట 6,14,371

సూర్యాపేట 6,82,882

వికారాబాద్ 6,71,940

వనపర్తి 3,67,521

వరంగల్ 3,89,052

యాదాద్రి 5,20,441