calender_icon.png 27 December, 2024 | 10:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంచాయతీ ట్రాక్టర్ అపహరణ

04-12-2024 01:19:26 AM

నల్లగొండ, డిసెంబర్ 3 (విజయక్రాంతి): పంచాయతీ కార్యాలయం ఎదుట నిలిపిన పంచాయతీ ట్రాక్టర్ ఇంజిన్‌ను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. నల్లగొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. తెలిసిన వివరాల ప్రకారం.. పంచాయతీ ట్రాక్టర్‌ను సిబ్బంది నిత్యం పాత పంచాయతీ కార్యాలయం ఆవరణలో నిలిపేవారు.

అక్కడ పైపులైన్ల మరమ్మతులు జరుగుతుండడంతో వారం నుంచి ట్రాలీని ఎస్సీకాలనీలో ఇంజిన్‌ను కొత్త పంచాయతీ భవనం ఎదుట రోడ్డు వెంట నిలుపుతున్నారు. మంగళవారం ఉదయం పంచాయతీ సిబ్బంది కార్యాలయం వద్దకు రాగా ట్రాక్టర్ ఇంజిన్ కనిపించలేదు.

దీంతో వారు పంచాయతీ కార్యదర్శికి సమాచారం అందించారు. పంచాయతీ కార్యదర్శి, మాజీ సర్పంచ్, గ్రామస్తులు వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.