calender_icon.png 4 March, 2025 | 9:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిజాయితీ చాటుకున్న పంచాయతీ సెక్రటరీ

04-03-2025 12:16:41 AM

కరీంనగర్, మార్చి 3 (విజయక్రాంతి): విధులకు హాజరయ్యేందుకు వెళ్తున్న పంచాయతీ సెక్రటరీ.. తనకు దొరికిన రూ.50 వేలను పోలీసులకు అప్పగించి నిజాయితీనిచాటుకున్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండి గ్రామంలో పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్న ఎస్ శ్రీనివాస్ సోమవారం విధులకు వెళ్తుండగా రామడుగు శివారులో బ్రిడ్జి వద్ద రూ.50 వేలు దొరికింది.

ఈ విషయాన్ని సెక్రటరీ స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే పోలీసులకు విషయం తెలిపి బాధితులకు డబ్బులు అందజేయాల్సిందిగా కోరారు. స్పందించిన పోలీసులు ఆ నగదు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం చీర్లవంచ గ్రామానికి చెందిన గంగు ఎల్లయ్యదిగా  గుర్తించారు.

గంగు ఎల్లయ్య తమ గ్రామంలో నిర్మించిన పెద్దమ్మ తల్లి దేవాలయానికి విగ్రహాలు కొనుగోలు కోసం రామడుగుకు వస్తుండగా మార్గమధ్యలో డబ్బులు పోగొట్టుకున్నట్టు తెలిపారు. ఈ డబ్బును కరీంనగర్ అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ చేతుల మీదుగా బాధితుడు గంగు ఎల్లయ్యకు అందజేశారు. కార్యక్రమంలో చొప్పదండి  సీఐ ప్రకాష్, రామడుగు ఎస్సు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.