12-02-2025 12:36:22 AM
చేర్యాల, ఫిబ్రవరి 11: అవినీతికి పాల్పడుతూ, వీధిలో పట్ల నిర్లక్ష్యం వహి స్తున్న ఐనాపూర్ గ్రామపంచాయతీ కార్య దర్శి సస్పెండ్ చేయాలని కోరుతూ కొమర వెల్లి ఎంపీడీవో కార్యాలయం ముందు గ్రామస్తులతో కలిసి సిపిఎం పార్టీ ఆధ్వర్యం లో మంగళవారం రోజు ధర్నాను నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి తాడూరి రవీందర్ మాట్లాడుతూ పింఛన్లు, ఇంటి పన్ను, ఇళ్ల పర్మిషన్ అంశాల లో అవినీతికి పాల్పడుతు న్నారన్నారు.
గ్రామస్తులు ఎవరైనా అతనిపై పై అధికారు లకు ఫిర్యాదు చేస్తే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడన్నారు. వసూలు చేసిన పన్నుల నగదును వ్యక్తిగతంగా వాడుకొని సకాలంలో ట్రెజరీలో జమ చేయడం లేదని ఆరోపించారు. వీధుల పట్ల కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. అతనిపై చర్యలు తీసు కోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఇంచార్జ్ ఎంపీడీవో శ్రీనివాస్ వర్మకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో తేలు ఇస్తారు, తాడూరు మల్లేశం, కానుగుల రాజు, సున్నం యాదగిరి, దండు శంకర్, ఎల్లయ్య, రాచకొండ రవి పాల్గొన్నారు.