calender_icon.png 24 November, 2024 | 12:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

06-11-2024 12:02:14 AM

భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 5 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి పంచాయతీ కార్యదర్శి పుల్లయ్య మం గళవారం లంచం డిమాండ్ చేసిన కేసులో ఆధారాలతో ఏసీబీకి చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ రమేశ్ తెలిపిన వివరా ల ప్రకారం.. రేగళ్లకు చెందిన భూక్యా లక్ష్మా ఇంటి నిర్మాణానికి అనుమతులు ఇచ్చేందుకు పంచాయ తీ కార్యదర్శి పుల్లయ్య రూ.20 వేలు డిమాండ్ చేశాడు. లక్ష్మా  ఏసీబీని ఆశ్రయించగా వారి సూచన మేరకు ఫోన్‌కాల్ సంభాషణను రికార్డు చేసి ఏసీబీ అధికారులకు అందించాడు. వాటి ఆధారంగా ఏసీబీ అధికారులు పుల్లయ్యను మంగళవా రం అదుపులోకి తీసుకున్నారు.