* నగరపాలక సంస్థ ఆధీనంలోకి పంచాయతీ కార్యాలయాలు
* మల్కాపూర్ లో రికార్డులు మాయం..?
కరీంనగర్, జనవరి 29 (విజయక్రాంతి): కొత్తపల్లి మున్సిపాలిటీతోపాటు చింత కుంట, మల్కాపూర్, బొమ్మకల్, దుర్శేడ్, గోపాల్ పూర్ గ్రామ పంచాయతీ రికార్డు లను బుధవారం కరీంనగర్ నగరపాలక సంస్థ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కమిషనర్ చాహత్ బాజాపాయ్ ఆదేశాల మేరకు విలీనమైన పంచాయతీల కార్యదర్శు లు, సిబ్బందితో సమావేశమైన కమిషనర్ రికార్డులను స్వాధీనం చేసుకోనున్నట్లు ప్రక టించి దిశానిర్దేశనం చేసిన అనంతరం రికార్డుల స్వాధీన ప్రక్రియ కొనసాగింది.
లావాదేవీలను కూడా నిలిపివేశారు. మిని ట్స్ పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. కొత్త పల్లి మున్సిపాలిటీ రికార్డులను, పంచాయతీ రికార్డులను ప్రభుత్వ ఆదేశాల మేరకు 6వ తేదీలోగా నగరపాలక సంస్థకు అప్పగించా లని కమిషనర్ ఆదేశించడంతో రికార్డుల స్వాధీన ప్రక్రియ కొనసాగింది. రికార్డులను పరిరక్షించి విభాగాల వారీగా రికార్డులను నిలిపివేసే ప్రక్రియ ప్రారంభించారు.
గ్రామ పంచాయతీ కార్యాలయాలు నగరపాలక సంస్థ ఆధీనంలోకి వచ్చాయి. ఒకటి, రెండు రోజుల్లో ప్రస్తుతమున్న పంచాయతీ కార్యాల యాలను వార్డు కార్యాలయాలుగా మార్చ నున్నారు. ఇదిలా ఉంటే కరీంనగర్ నగరా నికి ఆనుకొని ఉన్న మల్కాపూర్‌లో అక్రమం గా ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన పత్రాలను మాయం చేసినట్లు తెలిసింది.
ఇక్కడ అప్పటి గ్రామ పంచాయతీకి ఎలాం టి నిధులు సమకూర్చకుండా దొడ్డిదారిన అనునుతులు ఇచ్చారన్న ఫిర్యాదులు ఉండ డంతో రికార్డులను స్వాధీనం చేసుకుంటా రని ముందే తెలిసి కొందరు ఉద్యోగులు మాయం చేసినట్లు తెలిసింది. దీనిపై కమిషనర్ విచారణ జరిపే అవకాశం ఉంది.