calender_icon.png 24 January, 2025 | 3:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుండెపోటుతో పంచాయతీరాజ్ ఈఈ మృతి

24-01-2025 12:27:34 AM

కరీంనగర్ సిటీ, జనవరి23 (విజయ క్రాంతి): కరీంనగర్ జిల్లా పంచాయతీరాజ్ కార్యనిర్వాహక ఇంజినీర్ ఆర్ చంద్రశేఖర్ (59) గురువారం గుండెపోటు మరణిం చారు. పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన చంద్రశేఖర్ ఉద్యోగరీత్యా కరీంనగర్ లోని విద్యానగర్ లో నివాసం ఉంటున్నారు. ఉదయం గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు చంద్రశేఖర్ ను హుటాహుటిన అపోలో రీచ్ ఆస్పత్రికి తరలించారు.

చికిత్స పొందుతూ ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ఆయన తుది శ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారా యణ, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తో కలిసి హుటాహుటిన ఆపోలో రీచ్ కు చేరుకొని ఆయన భౌతిక కాయానికి నివాళు లర్పించారు.  చంద్రశేఖర్ కుటుంబ సభ్యు లను ఓదార్చారు. చంద్రశేఖర్ మృతిపట్ల వారు  సంతాపం ప్రకటించారు. 

జిల్లా అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, ఆర్డీవో మహేశ్వర్, కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ నియోజకవర్గ ఇంచార్జీ ఇంచార్జి పురుమల్ల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.  పంచాయతీ రాజ్ పర్యవేక్షక ఇంజినీర్ లచ్చయ్య, క్వాలిటీ కంట్రోల్ ఈఈ సూర్యప్రకాశ్ తోపాటు పలువురు డెప్యూటీ ఈఈలు, ఏఈలు,మినిస్టీరియల్ స్టాఫ్ ఉద్యోగులు ఆస్పత్రికి చేరుకుని సంతాపం వ్యక్తం చేశారు.