calender_icon.png 13 February, 2025 | 9:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంచాయతీ ఎన్నికల్లో అధికారులది కీలక పాత్ర

13-02-2025 06:47:35 PM

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే...

కుమ్రంభీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): స్థానిక సంస్థలు ఎన్నికలు రానున్న సందర్భంగా ఎన్నికల ప్రక్రియ, విధుల నిర్వహణలో స్టేజ్-1, 2 అధికారులదే కీలక భూమిక అని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భావన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, ఆర్డీవో అధికారి లోకేశ్వర్ రావు, డిపిఓ బిక్షపతి గౌడ్ లతో కలిసి కాగజ్ నగర్, ఆసిఫాబాద్ డివిజన్ లలోని స్టేజ్-1, 2 అధికారులకు, సిబ్బందికి వేరువేరుగా నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ... రానున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను అధికారులు సమన్వయంతో ఎలాంటి పొరపాట్లు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు.

రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలలో విధులు కేటాయించబడిన అధికారులు, సిబ్బంది తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాలని, ఈ క్రమంలో అందిస్తున్న శిక్షణను ఏకాగ్రతతో నేర్చుకోవాలని, ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించి ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం నడుచుకోవాలని తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి ఎన్నికల ప్రవర్తనా నియమావళి గడువు ముగిసేంత వరకు అధికారులు, సిబ్బందికి కేటాయించిన విధులను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు. వచ్చే సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల ఎన్నికలలో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం స్టేజ్ -1, 2 అధికారులను నియమించడం జరిగిందని, స్టేజ్-1 అధికారులు తమకు కేటాయించిన గ్రామపంచాయతీ సర్పంచ్ లు, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లు స్వీకరించడం, పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణ, బరిలో నిలిచిన అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు, నోటిఫికేషన్ వెలువడిన వెంటనే ఎన్నికల ప్రవర్తన నియమావళి పై సమీక్షించడం, ఎలాంటి వివాదాలు లేకుండా నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేయడం వంటి విధులు నిర్వహిస్తారని తెలిపారు.

స్టేజ్-2 అధికారులు తమకు కేటాయించిన గ్రామపంచాయతీ ఎన్నికల సామాగ్రి, పోలింగ్, అదనపు పోలింగ్ అధికారులతో కలిసి సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం, ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి చేయడం వంటి విధులు నిర్వహిస్తారని తెలిపారు. ఎన్నికల సామాగ్రి కవర్లు, డైరీలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, మాస్టర్ ట్రైనర్లు ఇచ్చిన శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారుల ఆదేశాల ప్రకారం విధులు నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేజ్-1, 2 అధికారులు, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి రమాదేవి, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.