నాగర్‌కర్నూల్, జూలై10 (విజయక్రాం తి): కుక్క పంచాయితీలో పోలీసులు చూపి న అత్యుత్సాహం నిండు ప్రాణాన్ని బలితీసుకున్నది. నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం వెల్గొండ గ్రామానికి చెందిన కుందేళ్ల రాజు(45), కుందేళ్ల బీరయ్య అన్నదమ్ములు. ఆదివారం రాత్రి రాజుకు చెందిన కుక్క తన తమ్ముడైన బీరయ్యపై దాడికి యత్నించడంతో వీరయ్య కుక్కపై రాయి విసిరాడు. దీంతో వీరయ్యపై రాజు చేయి చేసు కున్నాడు. మరుసటి రోజు బీరయ్య బిజినపల్లి పోలీసులకు రాజుపై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంగళవారం రాజును స్టేషన్‌కు పిలిచి, మంద లించారు. మరుసటి రోజుకూడా స్టేషన్‌కు రావాలని ఆదేశించారు. దీంతో మనస్తాపం చెందిన రాజు బుధవారం తెల్లవారుజాము న ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా గతంలోనే పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న వీరయ్యకు పోలీసులతో ఉన్న సత్సంబంధాల కారణంగా రాజును పోలీసులచేత చిత్రహింసలు గురి చేయించాడని రాజు అత్త కురువమ్మ ఆరోపించింది. ఎస్‌ఐ నాగశేఖర్‌రెడ్డిని వివరణ కోరగా.. అన్నదమ్ములిద్దరూ పెద్దల సమక్షంలో మాట్లాడుకోవాలని చెప్పానని ఎవరిపైనా చేయి చేసుకోలేదన్నారు.